ఓవెన్‌ కొంటున్నారా..

– మెకానికల్‌ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి.
– బేకింగ్, గ్రిల్లింగ్‌ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్‌ విత్‌ గ్రిల్‌ కొనడం మంచిది.

సాక్షి, హైదరాబాద్‌:

కేవలం ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసుకునేందుకు ఓవెన్‌ను కొంటున్నారా లేక కుటుంబ సభ్యులందరికీ సరిపడే పదార్థాలను రెగ్యులర్‌గా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా కుటుంబ సభ్యులతో చర్చించాలి. దీన్ని బట్టి ఓవెన్‌ సైజెంతో తెలిసిపోతుంది.
– బేసిక్‌ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్‌ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
– రీ హీట్‌ కోసమైతే బేసిక్‌ ఓవెన్‌ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్‌ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్‌ విత్‌ గ్రిల్‌ కొనడం మంచిది.
– మెకానికల్‌ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు.
– సింగిల్‌ టచ్‌ రోటరీ ప్యానల్‌ కూడా మెకానికల్‌ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది.
– ఎలక్ట్రానిక్‌ ప్యానల్‌ ఉన్న ఓవెన్‌లో విద్యుత్‌ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది.
– అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్‌టైల్‌ కంట్రోల్‌ ఓవెన్‌లు ఎంతో సహాయపడతాయి.
– చిన్న పిల్లలున్న ఇంట్లో చైల్డ్‌ సేఫ్టీ లాక్, ఎలక్ట్రానిక్‌ లాక్‌ ఉన్న ఓవెన్లను తీసుకోవడం ఉత్తమం.
– బజాజ్, శామ్‌సంగ్, కెన్‌స్టార్, ఎల్జీ వంటి రకరకాల బ్రాండెడ్‌ కంపెనీలు ఓవెన్లను అందిస్తున్నాయి. వీటి ధరలు రూ.5–40 వేల వరకున్నాయి.

Related Articles

© News. All Rights Reserved. Design by sakshi.com