చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!

– విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్దవే
– ఏడాదిలో గృహ ప్రవేశం.. వసతులు, గ్రీనరీలకూ ప్రత్యేక ఏర్పాట్లు
– అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్‌లే మేలు
– ప్రతికూల పరిస్థితుల్లో ఇవే మేలంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌:

ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే..
పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే..
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే..

వీటిన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం.

బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యిందో ప్రాజñ క్ట్‌ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్‌ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా.

ఏడాదిలో గృహప్రవేశం..

డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్‌లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్‌లో తమ కంపెనీ బ్రాండింగ్‌ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది.

వసతులకు కొదవేంలేదు..

గతంలో డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్‌ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్‌ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్‌ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్‌ పూల్, బేబీ, మదర్‌ కేర్‌ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం.

ప్రతికూలంలో చిన్న ప్రాజెక్ట్‌లే మేలు!

– రామ్‌ డెవలపర్స్‌ ఎండీ రాము
గతంలో చిన్న ప్రాజెక్టులు నిర్మించాలంటే బడా సంస్థలు అంతగా ఆసక్తి చూపించేవి కాదు. కానీ, మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో బడా ప్రాజెక్టులు ప్రారంభించి అమ్మకాల్లేక బాధపడటం కంటే డిమాండ్‌ ఉన్న ప్రాంతంలో చిన్న ప్రాజెక్టులను నిర్మించడమే మేలని రామ్‌ డెవలపర్స్‌ ఎండీ రాము వనపర్తి సూచిస్తున్నారు. పైపెచ్చు పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఐదారేళ్లు పడుతుంది. దీంతో నిర్మాణ వ్యయం తడిసి మోపడవుతుంది. అలాగే బడా ప్రాజెక్టులను ప్రజలు అంత సులువుగా నమ్మరు. పేరు మోసిన బిల్డర్‌ అయితేనే అమ్మకాలుంటాయి. కొత్త బిల్డర్‌కైతే మరింత కష్టం. కానీ చిన్న ప్రాజెక్టులు అలా కాదు నిర్మాణం పూర్తవక ముందే అమ్మకాలు పూర్తవుతాయి. నిర్మాణ వ్యయమూ భారంగా మారదనేది ఆయన అభిప్రాయం. 
– శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో వివిధ హోదాలో పదిహేనేళ్ల పాటు పనిచేసి.. స్థిరాస్తి రంగంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. దీంతో హైదరాబాద్, బెంగళూరులో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను చేయాలని నిర్ణయించుకున్నా.
– పంజగుట్టలోని సాయిబాబా గుడి దగ్గర్లో 550 గజాల్లో రామ్‌ మిడోస్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించాం. . నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. 1,600–1,700 చ.అ. విస్తీర్ణంలో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే వచ్చాయి. చ.అ. ధర రూ.7,000. ఇదే ప్రాంతంలో 1,050 గజాల్లో ఎలైట్‌ హ్యాబిటేట్‌ను నిర్మిస్తున్నాం. ఐదంతస్తుల్లో మొత్తం 15 ఫ్లాట్లొస్తున్నాయి. 1,100 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,500–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. చ.అ. ధర రూ.7,500. 
– చిక్కడపల్లిలో 500 గజాల్లో మైఫెయిర్‌ అవెన్యూస్‌ను నిర్మిస్తున్నాం. నాలుగంతస్తుల్లో మొత్తం 8 ఫ్లాట్లొస్తున్నాయి. 1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,500 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. చ.అ. ధర రూ.5,000.
– బేగంపేటలోని షాపర్స్‌ స్టాప్‌ ప్రక్కన 725 గజాల్లో రివర్‌స్టోన్‌ హ్యాబిటేట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో కూడా నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. 1,950 చ.అ.ల్లో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. చ.అ. ధర రూ.5,500.
– బెంగళూరులోని కేఆర్‌పురంలో 650 గజాల్లో రివర్‌స్టోన్‌ అడ్వాన్‌టేజ్‌ను నిర్మిస్తున్నాం. నాలుగంతస్తుల్లో 20 ఫ్లాట్లుంటాయి. 975–1,050 చ.అ.ల్లో అన్నీ 2 బీహెచ్‌కే ఫ్లాట్లే. చ.అ. ధర రూ.3,000.
– ఉల్సూరులో 475 గజాల్లో రివర్‌స్టోన్‌ చాన్స్‌లర్‌లో 8 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. 1,150–1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 2,000 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ.9,000.
– తనిసంద్ర మెయిన్‌ రోడ్‌లో రివర్‌స్టోన్‌ కోకోస్‌ 850 గజాల్లో మొత్తం 195 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. 1,100 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,500–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లొస్తున్నాయి. చ.అ. ధర రూ.5,500.

Related Articles

© News. All Rights Reserved. Design by sakshi.com