కరోనాతో లగ్జరీ గృహాలకు డిమాండ్‌

– రూపాయి క్షీణత, రాజకీయ, ఆర్ధిక అస్థిరతలూ కారణమే
– దీంతో రియల్టీలో పెట్టుబడులకు ఎన్నారై, హెచ్‌ఎన్‌ఐలు ఆసక్తి
– విస్తీర్ణమైన, ప్రీమియం ఇళ్ల ొనుగోళ్లకు మొగ్గు
– హైదరాబాద్‌ గృహ విక్రయాలలో లగ్జరీ వాటా 10 శాతం

సాక్షి, సిటీబ్యూరో:
లగ్జరీ గృహాల విక్రయాలకు ఊపొచ్చింది. కరోనా తర్వాతి నుంచి విస్తీర్ణమైన ఇళ్లను కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం ఒక కారణమైతే.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవటం, యూరప్, అమెరికా, గల్ఫ్‌ దేశాలలో రాజకీయ, ఆర్ధిక అస్థిరత మరోకారణం. ఫలితంగా దేశంలో ప్రీమియం ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం (హెచ్‌ 1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే  25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయి. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్‌ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్‌ చేశారు.
అత్యధికం ముంబైలోనే..
2022 హెచ్‌1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్‌సీఆర్‌లో 4,170 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్‌ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్‌సీఆర్‌లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 11,730 లగ్జరీ గృహాలు అమ్మకానికి ఉండగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికి 2,420 యూనిట్లు అమ్ముడుపోయాయి.

2022 హెచ్‌1లో నగరాల వారీగా లగ్జరీ గృహాల విక్రయాలు

నగరం గృహాల సంఖ్య
ముంబై 13,670
ఎన్‌సీఆర్‌ 4,170
హైదరాబాద్‌ 2,420
బెంగళూరు 2,430
పుణే 1,460
చెన్నై 920
కోల్‌కత్తా 630

లగ్జరీ గృహాల విక్రయాల వాటా (శాతంలో)

నగరం  2019 2022 వృద్ధి
ముంబై 13 25 12
ఎన్‌సీఆర్‌ 4 12 8
చెన్నై 2 10 8
బెంగళూరు 6 10 4
పుణే 1 5 4
కోల్‌కత్తా 3 6 3
హైదరాబాద్‌ 10 10 0

ఫ్లోర్‌కో ఫ్లాట్‌..
కరోనా తర్వాతి నుంచి అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరిగాయి. పెద్ద సైజు గృహాలనే కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ఇంటిలోకి ధారాలంగా గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు, వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం స్థలం, అనారోగ్యం పాలైతే హోం ఐసోలేషన్‌ కోసం ప్రత్యేకంగా గది ఇలా పక్కా ప్లానింగ్‌తో ఉండాలని భావిస్తున్నారు. దీంతో డెవలపర్లూ ఆ తరహా ఇళ్లనే నిర్మిస్తున్నారు. కరోనా కంటే ముందు 2,500 చ.అ. నుంచి 3,000 చ.అ.లను లగ్జరీ ఫ్లాట్లుగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ప్రీమియం అపార్ట్‌మెంట్ల ప్రారంభ విస్తీర్ణమే 3 వేల చ.అ. నుంచి ఉంటుంది. డీఎస్‌ఆర్, పౌలోమి వంటి కొన్ని నిర్మాణ సంస్థలైతే ఏకంగా అంతస్తుకు ఒకటే ఫ్లాట్‌ను నిర్మిస్తున్నాయి. 
– పుప్పాలగూడలో డీఎస్‌ఆర్‌ ఎస్‌ఎస్‌ఐ ట్విన్స్‌ ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్‌ 16 వేల చ.అ. ఉంటుంది.
– కోకాపేటలో పౌలోమి ఎస్టేట్స్‌ పలాజో ప్రాజెక్ట్‌లో 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ.లలో ఫ్లాట్లుంటాయి.
– ఖానామెట్‌లో మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మిస్తున్న ట్రంప్‌ టవర్స్‌లో 3 వేల చ.అ. నుంచి 6 వేల చ.అ. మధ్య ఫ్లాట్లున్నాయి.
– రాయదుర్గంలోని రాఘవ ఐరిస్‌ ప్రాజెక్ట్‌లో 5,425 చ.అ. నుంచి 6,605 చ.అ. మధ్య 4, 6 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లున్నాయి.
– ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఎటెర్నా ప్రాజెక్ట్‌లో రాజపుష్ప 2,360 చ.అ. నుంచి 4,340 చ.అ.లలో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తుంది.
లగ్జరీలో ఎన్నారైలు, హెచ్‌ఎన్‌ఐలదే జోరు

Related Articles

© News. All Rights Reserved. Design by sakshi.com