– ఉన్న ప్రాజెక్ట్‌ల్లోనే కొనడం మంచిదని.
– గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లు కొంటే మంచిది.
సాక్షి, హైదరాబాద్:
కరోనా
దేశంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం కంటే పాత నిర్మాణాలను పూర్తి చేయడం మీదే నిర్మాణ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. దీంతో గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న గృహాలు పెరిగాయి. కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. నిర్మాణంలో ఉన్న గృహాలు కొనడం బెటరా? లేక రెడీగా ఉన్నవి కొనడం ఉత్తమమా? అంటే కచ్చితంగా గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లోనే కొనడం మంచిదని.. పన్ను ప్రయోజనాలూ ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
– గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే ముందుగా కలిసొచ్చేది.. నిర్మాణ ఆలస్యమనేది ఉండనే ఉండదు. అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం గానీ, వసతుల ఏర్పాట్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. రెరా అమల్లోకి వచ్చాక డెవలపర్లు నిర్మాణ గడువును పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణ గడువును మూడేళ్లుగా ఉంటే ఇప్పుడది 5–6 ఏళ్లకు పొడిగించారు. ఎందుకంటే రెరాలో గడువు ముగిసిన ప్రాజెక్ట్ డెవలపర్లకు జరిమానా, జైలు శిక్షలు వంటివి కఠిన నిబంధనలున్నాయి.
నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలు చేస్తే కలిగే మొదటి ప్రయోజనం.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కట్టాల్సిన పన్లేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు 12 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే నిర్మాణంలో ఉన్న వాటి కంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది సుమీ!
చూసిందే కొంటాం..
ఫ్లాట్ విస్తీర్ణం, గదుల విస్తీర్ణం, అపార్ట్‌మెంట్ వ్యూ, నిర్మాణ నాణ్యత, వసతుల ఏర్పాట్లు, శానిటరీ, టైల్స్ వంటి ఉత్పత్తుల ఎంపిక వంటివి కళ్లతో ప్రత్యక్షం చూసి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే వీలుంటుంది. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ విషయం ఈ అవకాశం ఉండదు. మోడల్ ఫ్లాట్ లేదా లే అవుట్ ఎలివేషన్ చూసి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే నిర్మాణంలోని నాణ్యత పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేసే వీలుంటుంది.
ఏరియా అభివృద్ధి..
రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే మరొక ప్రయోజనం.. ప్రాజెక్ట్ ఏరియా అభివృద్ధి ప్రత్యక్షంగా తెలుస్తుంది. పరిసర ప్రాంతాల్లోని మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? రవాణా సదుపాయాలు, భద్రత పరిస్థితి ఏంటి? నిత్యావసరాలు ఎంత దూరమున్నాయి? పని ప్రదేశాలు, షాపింగ్ ప్రాంతాలు వంటివి గృహ ప్రవేశం చేయకముందే తెలిసిపోతాయి.
అద్దె కలిసొస్తుంది..
రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే.. కొనుగోలు చేసిన వెంటనే గృహ ప్రవేశం చేసేయవచ్చు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో కొంటే నిర్మాణం పూర్తయ్యే వరకూ అద్దె, నెలవారి వాయిదా రెండూ చెల్లించాల్సి వస్తుంది. అదే రెడీగా ఉన్న గృహమైతే.. అద్దె భారం తప్పుతుంది. ఒకవేళ సొంతంగా మీరుండేందుకు కాకుండా పెట్టుబడి కోసం రెడీగా ఉన్న గృహాలు కొనుగోలు చేస్తే గనక ఆపై నెల నుంచి అద్దె వస్తుంటుంది. ఏటేటా విలువ పెరుగుతుంటుంది కూడా.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com